NTV Telugu Site icon

Kukatpally ACP: కూకట్‌పల్లిలో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా కేసులో ఏసీపీ కీలక విషయాలు..

Kukatpally

Kukatpally

హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆగడాలను పోలీసులు గుట్టు రట్టు చేశారు. కూకట్ పల్లి మెట్రో కింద న్యూసెన్స్ చేస్తున్నట్లు గుర్తించారు. మెట్రో స్టేషన్ కింద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సోషల్ మీడియాలో కూకట్ పల్లి గర్ల్స్ పేరుతో ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెట్టి ముఠా వ్యభిచారం చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు

ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు విషయాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా మెట్రో స్టేషన్ల కింద మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో యూనిట్, హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌, షీ టీమ్స్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో నాలుగు టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఆకస్మిక తనిఖీలు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీలలో 31 మంది మహిళలు, యువతులు దొరికారన్నారు. వీరంతా అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చే వారి పట్ల సైగలు చేస్తూ వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చామని తెలిపారు.

Read Also: Shocking: డీజే రిపేర్‌కి డబ్బులు ఇవ్వలేదని.. ఫ్రెండ్‌తో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు..

ఈరోజు ఎమ్మార్వో ముందు వీరందరిని బైండోవర్ చేశామని.. వారం రోజులుగా జరిపిన ఈ ఆకస్మిక తనిఖీలలో మొత్తం 54 మందికి పైగా మహిళలు పట్టుబడ్డారని ఏసీపీ వెల్లడించారు. వీరందరికీ అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రెండుసార్లు పట్టుబడిన వాళ్లలో ఒక మహిళ మాత్రమే ఉంది.. మరోసారి పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించామని తెలిపారు. ఈ మహిళల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు కూడా ఇలాంటి మిస్ బిహేవ్ చేస్తున్న వాళ్లు కనపడితే వెంటనే డయల్ హండ్రెడ్‌కు కాల్ చేయాలని ఏసీపీ శ్రీనివాస్ రావు అన్నారు.