Acid Attack: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగులు వధూవరులపై యాసిడ్ విసిరారు. వధూవరులు, ఇద్దరు పిల్లలు సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వేడుకలో కరెంట్ పోయిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది. యాసిడ్ విసిరిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు భాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది.
Read Also: Aha: మూడోసారి అలరించడానికి ‘గీతా సుబ్రమణ్యం’ సిద్థం!
సమాచారం ప్రకారం.. బస్తర్ జిల్లాలోని ఛోటే అమాబల్ గ్రామంలో సుధాపాల్ నివాసి దమ్రు బాఘేల్ (23), సునీతా కశ్యప్ (19) వివాహ కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా వేడుకలో సడన్ గా లైట్లు ఆరిపోయాయి. ఇంతలో ఎవరో వధూవరులపై యాసిడ్ పోశారు. యాసిడ్ వారి పక్కనే ఉన్న వారిపై కూడా పడింది. దీంతో కార్యక్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన వెంటనే అందరినీ హడావుడిగా ఆస్పత్రికి తరలించారు.
Read Also: Vizag Steel Plant EOI Bidding : విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐపై ఉత్కంఠ..
యాసిడ్ దాడి ఘటనలో వరుడు దమ్రు బాఘెల్ (23), వధువు సునీతా కశ్యప్ (19), సంపత్ బాఘెల్ (32), ఆరేళ్ల తేమేశ్వర్ మౌర్య, తుల కశ్యప్ (19), నాలుగేళ్ల జమానీ కశ్యప్, గుంజి. ఠాకూర్ (25) కరీ బాయి కశ్యప్ (29), గున్మణి కశ్యప్ (29), మల్తీ కశ్యప్ (38), మిత్కీ కశ్యప్ (38), గోయండ కశ్యప్ (38) గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ నివేదా పాల్ తెలిపారు. ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. స్టేషన్ ఇన్‌చార్జి కిషోర్ కేవత్ సంఘటనా స్థలంలో ఉన్నారు. యాసిడ్ దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడిని ఇంకా గుర్తించలేదు. లైట్లు ఆర్పే సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.