NTV Telugu Site icon

Vizag SEZ Blast: అచ్యుతాపురం సెజ్ లో పేలుడు.. ఒకరి మృతి

Gfmc

Gfmc

ఏపీలో అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగించాయి. చిత్తూరులో అర్థరాత్రి అమరరాజా కంపెనీలు భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ)లో గల జి ఎఫ్ ఎం ఎస్ ఫార్మా కంపెనీలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది. ఈ కంపెనీ రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగగానే భయంతో కార్మికులంతా పరుగులు పెద్ద ఎత్తున మంటలు రావడంతో వీటిని అదుపు చేయడానికి జిల్లాలోని అన్ని అగ్గిమాప వాహనాలు అక్కడికి స్థానిక అగ్నిమాపక వాహనం మంటలను అదుపు చేస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపిస్తున్నారు.

Read Also: Thalapathy 67: కాశ్మీర్ వెళ్లిన చిత్ర యూనిట్… ఫిబ్రవరి 3న స్పెషల్ గిఫ్ట్

కార్మికులు ప్రమాదంపై ఆందోళన చెందడంతో పలువురు అస్వస్థత గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ రియాక్టర్ పేలుడు ఘటనతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను చేపడుతున్నారు.. జిల్లా అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడానికి బయలుదేరారు.

Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్