Site icon NTV Telugu

Accident or Conspiracy: Godhra : గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంతో తెరకెక్కిన ‘గోద్రా’..ఆసక్తిగా సాగిన టీజర్‌..

Whatsapp Image 2024 02 03 At 3.25.01 Pm

Whatsapp Image 2024 02 03 At 3.25.01 Pm

బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది ‘ది కశ్మీరీ ఫైల్స్’,అలాగే కేరళలో లవ్ జిహాద్ పై ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో “యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా”అనే సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే మనకు గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. దాదాపు 21 ఏళ్ల క్రితం జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మూవీని తెరక్కిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజ జీవిత సంఘటన ఆధారం వస్తోన్న ఈ మూవీ టీజర్ ఎంతో ఆసక్తిగా సాగింది.

2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం సబ్ టైటిల్స్ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర అంటూ టీజర్ ను ముగించారు.. బీజే పురోహిత్ మరియు రామ్ కుమార్ పాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ షోరే మరియు మనోజ్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు.ఈ మూవీ టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ హింట్ ఇచ్చారు. మార్చి 1న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది.కాగా 2002లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో మత కల్లోలాలు జరిగాయి. గోద్రా రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి.. అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Exit mobile version