Shiva Balakrishna Case: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది. రూ.2.70 కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితమే ఈ మొత్తాన్ని చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
Read Also: Mallareddy: బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తుపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
శివ బాలకృష్ణ ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. బినామీలు పేర్లతో భారీగా ఆస్తుల కొనుగోలుపై ఆరా తీస్తున్నారు. పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలలో పెట్టుబడులపై ఏసీబీ దృష్టి సారించింది. శివ బాలకృష్ణకు సోదరుడు శివ నవీన్‌తో పాటు మరో నలుగురు బినామీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారితో ఆయన వద్ద పని చేసిన వారిని కూడా ఏసీబీ అధికారులు త్వరలో విచారించనున్నారు. విచారణలో శివబాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారి విషయంలో న్యాయసలహా తీసుకున్న ఏసీబీ.. నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధంగా ఉంది.