Site icon NTV Telugu

Shiva Balakrishna : HMDA మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణ ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు

Hmda Shiva Balakrishna

Hmda Shiva Balakrishna

HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. ఆయనను విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది ఏసీబీ. 161 కింద నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ దగ్గర దొరికిన ల్యాబ్‌టాప్‌, సెల్‌ఫోన్లు అనాలసిస్‌ చేస్తున్న ఏసీబీ.. శివ బాలకృష్ణ, ఐఏఎస్‌ అరవింద్‌ల మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ను రిట్రీవ్‌ చేసేందుకు ప్రయత్తిస్తోంది.

PM MODI: బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..

ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్‌ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు చెబుతున్నారు. భూములు కొని రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందుంది. అలాగే ఐఏఎస్‌ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్‌ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఐఏఎస్‌ అరవింద్‌ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఏసీబీ. ఐఏఎస్ అధికారి అదేశాల మేరకు అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలు గడించినట్లు.. ఇదే విషయాన్ని కస్టడీ సమయంలో ఏసీబీకి శివ బాలకృష్ణ వెల్లడించినట్లు సమాచారం.

Nani: టాప్ సినిమాలతో పాటు టాప్ బ్రాండ్స్ కూడా.. అదిరిందయ్యా సుందరం

Exit mobile version