AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు..
Read Also: Sensational Combo : కమల్ హాసన్.. రజనీకాంత్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే
కేసులో మరో ఇద్దరు నిందితులు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేయగా వాటిని కూడా ఏసీబీ కోర్ట్ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ ప్రత్యేక అధికారిగా సత్య ప్రసాద్ పని చేశారు.. ఈ కేసులో ఏ2, ఏ3గా ఉన్న ఇద్దరు నిందితుల పాత్ర ఉందని సిట్ చెబుతోంది… దీంతో ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు, అదే సమయంలో అప్రూవల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అప్రూవల్ పిటిషన్లను టెక్నికల్ కారణాలతో కోర్టు రిటర్న్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లు మాత్రమే దాఖలు అవటంతో కోర్టు విచారణ జరిపింది .రెండు పిటిషన్లు డిస్మిస్ చేసింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..
