Site icon NTV Telugu

DC vs LSG: 30 మంది అనాథ‌ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవ‌కాశం క‌ల్పించిన ఏసీఏ

Dc Vs Lsg

Dc Vs Lsg

క్రికెట్ ప్రియులను అలరించేందుకు వైజాగ్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఏసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ క్రికెట్ స్టేడియంలో 30 మంది అనాథ‌ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవ‌కాశం క‌ల్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్. ఏసీఏ తన సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేసింది.

Also Read:Physical Harassment : ఎంఎంటీఎస్ రైల్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం!

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు పాపా హోమ్స్ చిన్నారులు అక్కడికి చేరుకున్నారు. తమకు మ్యా్చ్ చూసే అవకాశం కల్పించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కి పాపా హోమ్ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులకు మ్యాచ్ వీక్షించే అవకాశం కల్పించిన ఏసీఏపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Exit mobile version