AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Sales Decline: ఈ ఏడాది వేసవి ప్రారంభమైనా ఎయిర్ కండిషనర్ల (AC) అమ్మకాలు ఊపందుకోలేదు.. సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రారంభంలోనే ఏసీలకు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి అకాల వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి సీజన్లో ఏసీల డిమాండ్ సుమారు 30 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ముందుగానే సిద్ధం చేసుకున్న భారీ స్టాక్‌లు ఇప్పుడు డీలర్ల వద్ద పేరుకుపోయాయి. సుమారు 25 లక్షల యూనిట్ల వరకు నిల్వలు ఉండటం కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది.
Read Also: YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్..!
Also Read
- Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
- Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
- Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
- US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
ఈ పరిస్థితి స్టాక్ మార్కెట్లో కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా Voltas వంటి మార్కెట్ లీడర్ కంపెనీ షేర్లు గత నెలలో 15 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. అలాగే Blue Star షేర్లు కూడా సుమారు 18 శాతం వరకు తగ్గాయి. Havells India, Whirlpool India మరియు LG Electronics షేర్లు కూడా క్షీణతను చవిచూశాయి. వాతావరణం మాత్రమే కాదు, ఇతర కారణాలు కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. 2026 జనవరిలో అమల్లోకి వచ్చిన కొత్త ఇంధన సామర్థ్య (BEE) నిబంధనల వల్ల ఏసీల ధరలు 5-10 శాతం వరకు పెరిగాయి. దీంతో మధ్యతరగతి వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గింది. అదనంగా, రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం కూడా కంపెనీలకు సవాలుగా మారింది.
అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, మే, జూన్ నెలల్లో వడగాలులు పెరిగితే ఏసీల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఆ నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం మందగించిన మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, వాతావరణ మార్పులు, పెరిగిన ధరలు, ఆర్థిక ఒత్తిడులు కలిసి ఏసీ మార్కెట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాబోయే నెలల్లో వేడి తీవ్రత పెరిగితేనే ఈ రంగం మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!