NTV Telugu Site icon

AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..

Ac Buff

Ac Buff

ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది బాధపడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు వేడిని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్‌, కూలర్లును ఉపయోగిస్తారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీని కారణంగా, ఒక వ్యక్తి ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు.

Also Read: Whats up: వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేస్తే అకౌంట్ బ్లాక్

అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వినియోగదారుడు షేర్ చేశాడు. వైరల్ వీడియోలో, ఎవరో వ్యక్తి గేదల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ముర్రా జాతి గేదెలను ఇంటి లోపల ఇంచి ఏసీ వేసి పెంచుతున్నారు. గదిలో రెండు ఎయిర్ కండీషనర్లు అమర్చాడు సదరు రైతు. వాటితోపాటు ఫ్యాన్, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం పూట తన గేదెలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..

ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దాదాపు 30,000 మంది ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. “మిత్రమా., అవి జంతువులు. వాటిని ఆరుబయట ఉంచాలి, ఎయిర్ కండీషనర్లు వాటి ఆరోగ్యానికి హానికరం” అంటూ కొందరు అనగా, “మాల గేదెలు వేడిని తట్టుకోలేవు, ఇది అంబానీ గేదె” అని వ్యాఖ్యానించారు.