NTV Telugu Site icon

Adani Group: మరింత పెరగనున్న అదానీ ‘పవర్’.. 2బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న అబుదాబి కంపెనీ

Adani

Adani

Adani Group: హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌కు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. అదానీ గ్రూప్‌పై పెట్టుబడిదారుల విశ్వాసం అలాగే ఉందని దీంతో నిరూపితం అవుతోంది. దీంతో వారు అదానీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల అమెరికా కంపెనీ GQG అదానీ పవర్‌లో రూ.4242 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు అదానీ కంపెనీలపై అబుదాబికి నమ్మకం పెరగడం మొదలైంది. దీని కారణంగా అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ PJSC అదానీతో భారతదేశంలో వ్యాపారాన్ని పెంచుకోవాలని భావించింది. అబుదాబి కంపెనీ గౌతమ్ అదానీ విద్యుత్ వ్యాపారంలో అంటే అదానీ గ్రీన్ ఎనర్జీలో 2 బిలియన్ల పెట్టుబడి పెట్టాలనుకుంటోంది. ఇది ఉష్ణ ఉత్పత్తి నుండి ప్రసారం, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వరకు వేగాన్ని అందిస్తుంది.

TAQA యూరోప్, పశ్చిమాసియా, ఆఫ్రికాలో ఇప్పటికే తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అదనంగా ఇది అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌లో అతిపెద్ద స్టాక్స్ కలిగి ఉంది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ కంపెనీలో TAQA 1.5-2.5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. TAQA, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఒక ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నాయి. TAQA కంపెనీలో మార్కెట్, ప్రమోటర్ల నుండి 19.9 శాతం వాటాను తీసుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం అదానీ గ్రీన్ సొల్యూషన్ విలువ 68.28 శాతం ప్రమోటర్ల వాటాతో రూ.91 వేల 660 కోట్లుగా ఉంది. అబుదాబి సంస్థ ప్రస్తుత ధర రూ. 18,240 కోట్ల విలువతో 20 శాతం వాటాను తీసుకోవాలనుకుంటోంది. గురువారం అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఒక్కో షేరు రూ.821 వద్ద ముగిసింది.

Read Also:Snake In Cauliflower: క్యాలీఫ్లవర్ లో కట్లపాము.. చూస్తే పై ప్రాణం పైకే పోతుంది

TAQA కంపెనీ ఏమి చేస్తుంది?
అరబ్ దేశంలో ఇంధన సరఫరా కోసం TAQA పనిచేస్తుంది. ఈ కంపెనీ పెట్టుబడి విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీపై ఉంది. ఇది కాకుండా చమురు, గ్యాస్‌ను కూడా సరఫరా చేస్తుంది. UAE, సౌదీ అరేబియా, కెనడా, ఘనా, ఇండియా, ఇరాక్, మొరాకో, ఒమన్, నెదర్లాండ్స్, UK , USAలలో కంపెనీ ఉనికిని కలిగి ఉంది.

భారత్‎లో కూడా విద్యుత్తు సరఫరా
TAQA భారతదేశంలోని తమిళనాడులో 250 MW థర్మల్ పవర్ ప్లాంట్‌ను కలిగి ఉంది. ఇది రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థ అయిన తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (TANGEDCO)కి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.. విద్యుత్ ను విక్రయిస్తుంది.

Read Also:CSK: చెన్నై సూపర్‌ కింగ్స్‌ అరుదైన రికార్డు.. తొలి ఐపీఎల్‌ జట్టుగా..!

Show comments