ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హతమయ్యాడు. శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు పాల్పడ్డాడు. NIA అతన్ని వాంటెడ్‌గా ప్రకటించింది. అబూ ఖతల్.. హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా గుర్తించబడ్డాడు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Also Read: Chandrababu Naidu: మనం నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు ఆయన: సీఎం
ఈ దాడికి అబూ ఖతల్ ప్రధాన సూత్రధారి. 2023 సంవత్సరంలో రాజౌరి దాడికి కూడా అబూ ఖతల్ బాధ్యత వహించాడు. సింఘి జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక సంఘటనలకు పాల్పడిన చాలా మంది వ్యక్తులు మరణించారు. కొన్ని రోజుల క్రితం లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసిం హతమయ్యాడు. బషీర్ అహ్మద్ కూడా అనుమానాస్పదంగా మరణించాడు.