Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..

Abhishek Sharma Popularity

Abhishek Sharma Popularity

Sanju Samson: అభిషేక్ శర్మ.. టీ20 వరల్డ్ కప్‌ 2026 సీజన్‌లో ఈ పేరు మార్మోగిపోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెట్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. అభీ ఫైనల్‌ మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అభిషేక్ శర్మపై టీమిండియా ప్లేయర్లలో ఈర్ష్య పెరుగుతుందట. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. అభిషేక్ శర్మకు పెరుగుతున్న పాపులారిటీ చూస్తుంటే జట్టులోని ఇతర ఆటగాళ్లకు కాస్త అసూయగా అనిపిస్తోందంటూ సంజూ సరదాగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ క్రేజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఎక్కడ పర్యటించినా, అభిమానులు కేవలం అభిషేక్‌ను చూసేందుకే క్యూ కట్టేవారని గుర్తు చేశాడు.

READ MORE: Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!

“స్టేడియంలో అభిషేక్‌దే హవా.. మొదట్లో అభిషేక్ కోసం వస్తున్న అరుపులు, కేకలు చూసి జట్టులోని కుర్రాళ్లు కుళ్లు కునేవాళ్లు. ఫ్యాన్స్ ఎక్కడ చూసిన అభిషేక్.. అభిషేక్ అని అరుస్తుంటారు. అసలు స్టేడియంలో ఉన్న జనాలకు మేము కనిపిస్తున్నామా? లేదా? అనే డౌట్ వచ్చేది. మేము ఉన్నా కూడా కేవలం అభిషేక్‌ను మాత్రమే చూస్తున్నారా? అని మేము నవ్వుకునేవాళ్లం.” అని సంజూ వెల్లడించాడు. భాయ్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో.. అప్పుడైనా మాకు కొంచెం లైమ్‌లైట్ దక్కుతుందని సంజూ నవ్వుతూ చెప్పాడు. అభిషేక్ గురించి అనేక విషయాలను పంచుకున్నాడు సంజూ.. ఓ విధంగా చెప్పాలంటే అభిషేక్‌ను షోలో ఆటపట్టించాడు. అంతే కాదు.. అభిషేక్ కృషి పట్టుదలను కొనియాడుతూ ప్రస్తుతం టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా కొనసాగడంపై సంజూ ప్రశంసించాడు.

READ MORE: Sanju Samson: “జట్టులో చోటు లేనప్పుడు కుంగిపోయా.. కానీ”.. విక్టరీ వెనకున్న కన్నీళ్లను పంచుకున్న సంజూ శామ్సన్..

ఇక అదే వేదికపై అభిషేక్ సైతం మాట్లాడాడు.. తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడటం, రాణించడం గురించి వివరించాడు. నా లక్ష్యం ఒక్కటే టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో రాణించడం అని అభీ వెల్లడించాడు. తన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచనని స్పష్‌టం చేశాడు. గురువు యువరాజ్ సింగ్ తనకు నేర్పిన పద్ధతుల గురించి మాత్రమే ఆలోచిస్తానన్నాడు. వాటినే అనుసరిస్తానని వెల్లడించాడు. వన్డే క్రికెట్‌లో చోటు దక్కితే తన కల సహకారమైనట్లే అని స్పష్టం చేశాడు.