Abhishek Agarwal : టైగర్ నాగేశ్వరరావు మా డ్రీమ్ ప్రాజెక్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.’కంటెంట్ బేస్డ్, అన్ టోల్డ్ స్టొరీస్ చెప్పాలనేది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లక్ష్యం. ఈ సినిమా కూడా అలాంటి పవర్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా. అస్సలు నాగేశ్వరరావు దొంగ ఎందుకయ్యాడు.. ఆ తర్వాత ఏం చేశాడు లాంటివన్నీ ఈ సినిమాలో చూపించడం జరిగింది.. అయితే ఏమాత్రం రాజీ పడకుండా ఈ కథకు ఏం కావాలో అది వందశాతం మేము ఇచ్చాం.
రవితేజ గారు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కూడా ఆయనే చేశారు. తన చేతికి గాయమైనప్పటికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ షూటింగ్‌కి ఇబ్బంది లేకుండా చేశారు.ఈ జర్నీ చాలా మెమరబుల్ గా సాగింది.టైగర్ నాగేశ్వరావు మా డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే మొదటి నుండి ప్రమోషన్‌పై స్పెషల్ గా ఫోకస్ పెట్టాం. ఫస్ట్ లుక్ రాజమండ్రిలో అలాగే ట్రైలర్‌ను నార్త్‌లో ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశాం. దీంతో తెలుగుతో పాటు నార్త్‌లో కూడా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కంటెంట్‌పై ఎంతో నమ్మకంగా వున్నాం. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని నమ్మకం వుంది.. నా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ఈ సినిమా నిలిచిపోతుంది. వచ్చిన మూడేళ్ళలోనే నిర్మాతగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకోవడం మా సంస్థకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. ఇక త్వరలోనే మరో బయోపిక్ ను అనౌన్స్ చేస్తున్నాం. అది కూడా ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.త్వరలోనే ఆ బయోపిక్ గురించి అధికారిక వివరాలు తెలియజేస్తాము అని ఆయన తెలియజేశారు.
Also Read
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!