NTV Telugu Site icon

Abhinav Bindra: గోల్డ్ మెడల్ విన్నర్ కు అరుదైన గౌరవం.. ‘ఒలింపిక్ ఆర్డ‌ర్ అవార్డు’..

Abhinav Bindra

Abhinav Bindra

Abhinav Bindra: భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ” ఒలింపిక్ ఆర్డర్ అవార్డు” ను అందుకోబోతున్నాడు. ఆగస్టు 10న పారిస్‌లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం అందించారు. ఒలంపిక్ మూమెంట్‌లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్‌తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో రాశారు. అవార్డు వేడుకకు అభినవ్‌ను కూడా ఆహ్వానించాడు. బింద్రాకు ఈ అవార్డు ఇవ్వడంపై భారత క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా సంతోషం వ్యక్తం చేశారు.

Lalu Prasad Yadav: కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ రాజీనామా చేయాలి

ఒలింపిక్ ఆర్డర్ అవార్డ్ అంటే ఒలింపిక్ మూమెంట్ ఇచ్చే అతిపెద్ద అవార్డు. ఇది చాలా ప్రత్యేకమైన సహకారం కోసం ఇవ్వబడుతుంది. ఈ అవార్డును 1975లో ప్రారంభించారు. ఈ అవార్డును మూడు విభాగాల్లో అందజేస్తారు. బంగారం, వెండి, కాంస్యం. అప్పటి నుండి 116 మంది ప్రముఖులు గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్‌ను అందుకున్నారు. వీరిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఒలింపిక్ మూమెంట్‌కు మద్దతు ఇచ్చినందుకు అభినవ్‌కు ఈ గౌరవం లభించింది. అతను ఒలింపిక్ మూమెంట్ ఇండియాతో అనుబంధం కలిగి ఉన్నాడు.

Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!

అభినవ్ బింద్రా కంటే ముందు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ అవార్డును అందుకున్నారు. 1983లో ముంబైలో జరిగిన అవార్డు వేడుకలో ఇందిరా గాంధీకి ఈ అవార్డు లభించింది. 2008లో రైఫిల్ షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన తొలి ఒలింపిక్ స్వర్ణ విజేత బింద్రా. ఒలంపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారతదేశం నుంచి తొలి ఆటగాడు. అభినవ్ తర్వాత, 2021లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించాడు.