Huge No Ball: ఇది నో బాల్ కాదు.. అంతకుమించి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhimanyu Mithun Stuns Cricket Fans With A Huge No-Ball: క్రికెట్లో ఏ బౌలర్ అయినా ‘నో బాల్’ వేస్తుంటాడు. క్రీజ్ వద్ద ఉండే ఫ్రంట్ లైన్‌ను బౌలర్ పాదం సగం కంటే ఎక్కువ ధాటితే.. అంపైర్ నో బాల్ ఇచ్చేస్తాడు. చాలా మంది బౌలింగ్ వేసేప్పుడు నియంత్రణ కోల్పోయి.. క్రీజ్ ఆవల అడుగు వేస్తుంటారు. అయితే బౌలర్ ఫుట్కు, క్రీజుకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ మాత్రం భారీ నో బాల్ వేశాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్, నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్.. భారీ నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్ ఓవర్ స్టేప్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. రిప్లేలో అభిమన్యు ఫుట్కు, క్రీజుకు మధ్య దూరం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రీజు నుంచి 2 గజాల దూరంలో అభిమన్యు తన ఫుట్‌ను ల్యాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలో ఇదే భారీ నో బాల్ అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read
Also Read: IPL 2024: ఐపీఎల్ 2024కు స్టార్ బౌలర్ దూరం!
గతంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారీ నో బాల్ వేసాడు. ఇంగ్లాండ్ జట్టుపై 2010లో జరిగిన లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ చేసి భారీ నో బాల్ వేసాడు. ప్రస్తుతం అభిమన్యు మిథున్ వేసిన నో బాల్ దీనికి గుర్తు చేస్తుంది. అభిమన్యు ఏమైనా ఫిక్సింగ్ చేశాడా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ ఓడిపోయింది. 107 పరుగుల ఛేదనలో సికందర్ రజా 10 బంతుల్లో 27 పరుగులు చేసి చెన్నైను గెలిపించాడు.
What’s happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10
pic.twitter.com/FGcbshIhPz— Farid Khan (@_FaridKhan) December 2, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!