NTV Telugu Site icon

Abhimanyu Iswaran: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా నాలుగో సెంచరీ.. టీమిండియా తలుపు తడుతున్నాడుగా.!

Abhimanyu Iswaran

Abhimanyu Iswaran

Abhimanyu Iswaran: రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టుపై బెంగాల్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతనికిది వరుసగా నాలుగో సెంచరీ. అంతకుముందు దులీప్ ట్రోఫీలో రెండో, మూడో మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇరానీ కప్‌లోనూ తన బ్యాట్‌తో సెంచరీ సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో ఇది 27వ సెంచరీ. ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజిలో బెంగాల్ పోటీలో తన పట్టును పూర్తిగా పటిష్టం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. అనంతరం ఉత్తరప్రదేశ్ జట్టు 292 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్, సుదీప్ ఛటర్జీ తొలి వికెట్‌కు 302 బంతుల్లో 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సుదీప్ 93 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఔటైన తర్వాత ఈశ్వరన్ సెంచరీ పూర్తి చేశాడు.

Hassan Nasrallah: నస్రల్లా చనిపోయిన 2 వారాల తర్వాత హిజ్బుల్లా ఆడియో సందేశం రిలీజ్..

ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు సాధిస్తున్నాడు. అతను తన బ్యాట్‌తో 99 మ్యాచ్‌లలో 169 ఇన్నింగ్స్‌ లలో 50 సగటుతో 7,500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో అతను 27 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 233 పరుగులు. ఇరానీ కప్‌లో ముంబై క్రికెట్ జట్టుపై 191 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను దులీప్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లలో 116, 157* పరుగులు చేశాడు. అతను లిస్ట్-A క్రికెట్‌లో 88 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 86 ఇన్నింగ్స్‌లలో 3,847 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈశ్వరన్ భారత క్రికెట్ జట్టులో చాలాసార్లు ఎంపికయ్యాడు. కానీ., అతను అరంగేట్రం చేయలేకపోయాడు.

New Liquor Policy: కొనసాగుతున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ.. కొత్త లిక్కర్ బ్రాండ్లు రెడీ..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ముఖ్యమైన వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ మొదటి లేదా రెండవ మ్యాచ్‌లో ఆడలేడని అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. దింతో ఈశ్వరన్‌ను బ్యాకప్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులో భాగం చేయవచ్చు. ఈ ట్రోఫీకి ముందు భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య సిరీస్ కూడా జరగనుంది. అప్పుడు ఈశ్వరన్ ఆస్ట్రేలియాలో ఉంటాడు. శుభమాన్ గిల్, KL రాహుల్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నారు.