Site icon NTV Telugu

Abdullahpurmet: హైటెన్షన్ డ్రామా.. విద్యుత్ టవర్ పై నుండి దూకేసిన వ్యక్తి…!

Abdullahpurmet

Abdullahpurmet

Abdullahpurmet: ఈ మధ్య కొందరు కరెంటు పోల్స్ ఎక్కి వారి నిరసనను వ్యక్తం చేయడం కామన్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో విద్యుత్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి చేసిన సాహసం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కిన ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, విద్యుత్ శాఖ అధికారులు పైకి ఎక్కి అతడిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా టవర్ పైనుండి కిందకు దూకేశాడు. ఇది చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

SBI PO 2025: ఎస్బీఐలో ఉద్యోగాల జాతర.. వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నాహాలు

అదృష్టవశాత్తూ టవర్ కింద ప్రాంతంలో బురద ఉండటంతో, అందులో పడడం వల్ల అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర ప్రమాదం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏ కారణం చేత ఆ వ్యక్తి టవర్ ఎక్కాడు, ఎందుకు దూకేశాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం పోలీసులు, అధికారులు విచారణ చేపడుతున్నారు.

Baahubali The Epic : ఆ సీన్ నాకు ఎప్పటికీ స్పెషల్.. రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ..

Exit mobile version