ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జస్టిస్ (రిటైర్డ్) నజీర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మూడవ గవర్నర్. ఇ.ఎస్.ఎల్. నరసింహన్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి మొదటి గవర్నర్‌గా పనిచేశారు. బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 24, 2019న రెండవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే నేడు ఏపీకి నూతన గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు నజీర్.
Also Read : Diamond Auction : వజ్రాల వేలం జరుగుతోంది.. త్వరపడండి నేడే ఆఖరి రోజు
అయితే.. నిన్న రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఆయన రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో విశ్వభూషణ్‌కు సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీసులు గౌరవ వందనం చేశారు.
Also Read : Bollywood: అమితాబ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…
