NTV Telugu Site icon

IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్‌.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ.. ‌‌‌

Ips Aashna Chaudhary

Ips Aashna Chaudhary

భారతదేశంలోని లక్షలాది మంది యువత సివిల్ సర్వెంట్‌లుగా మారి దేశానికి సేవ చేయాలని కలలు కంటున్నారు. అయితే.. ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం అంత సులభం కాదు. దీనికి కృషి, అంకితభావం, పట్టుదల అవసరం. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఆష్నా చౌదరి. ఆమె జీవితంలో అనేక సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొన్నారు. కానీ తన ఆశయాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఆష్నా ఒక ఐపీఎస్ అధికారి, ఆమె 2022లో యూపీఎస్సీ పరీక్షలో 116వ ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించారు. వరుసగా రెండుసార్లు విఫలమైన ఆమె మూడో ప్రయత్నంలో ఈ విజయం పొందారు. ఆమె కథ సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

ఉత్తరప్రదేశ్‌ కి చెందిన ఆష్నా.. 

ఆష్నా చౌదరి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని పిల్ఖువా అనే పట్టణంలో నివాసి. ఆమె తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తల్లి ఇందు సింగ్ గృహిణి. ఆష్నా ఎప్పటి నుంచో చదువు పట్ల, సామాజిక సేవ పట్ల ఆసక్తి కనబరుస్తోన్నారు. పిల్ఖువాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్, ఉదయపూర్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్, ఘజియాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో సహా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తన చదువులో మంచి ప్రతిభ కనబరిచారు. 12వ తరగతిలో హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో 96.5 శాతం మార్కులు సాధించారు. ఆమె భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలలలో ఒకటైన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె చదువుతున్న సమయంలో వెనుకబడిన పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడే ఒక ఎన్జీవోతో కూడా పనిచేశారు.

READ MORE:Amit Shah: బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను టచ్ చేయలేరు.. రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్..

డిగ్రీలోనే మోడలింగ్ అవకాశాలు..

ఆష్నా చౌదరి డిగ్రీ చదువుతుండగా కొత్త రకం ఫ్యాషన్స్, పర్యాటక కేంద్రాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఆమె పోస్టులు చూసి పలు సంస్థలు మోడలింగ్ అవకాశాలు ఇచ్చాయి. అభిమానులు సైతం కూడబెట్టుకున్నారు. సివిల్స్‌ నిర్ణయం తీసుకున్నాక మోడలింగ్‌ని పక్కనపెట్టారు. గతంలో ఉద్యోగం కోసమని ‘జోష్‌ టాక్స్‌’కి వెళితే ఆష్నాను తిరస్కరించారు. ఉద్యోగానికి వెళ్లిన అదే చోటుకి అతిథిగా వెళ్లిన ఆమె తన పట్టుదలను, సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పడు తన కథ నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆష్నా తన సివిల్స్‌ ప్రయాణం, సన్నద్ధత, అనుసరించిన వ్యూహాల వివరాలను ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో పంచుకుంటుంటారు. స్ఫూర్తి కలిగించే మాటలతో వాళ్లలో ధైర్యాన్నీ నింపుతుంటారు. అందుకే ఆమెకు ఇన్‌స్టాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

READ MORE: Rahul Gandhi: ఇండియాకి బద్ధ వ్యతిరేకి, పాక్ మద్దతురాలు.. ఇల్హాన్ ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ..

2019లో యూపీఎస్సీ కి ప్రిపేర్..

2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆష్నా చౌదరి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ కావడం ప్రారంభించారు. ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఒక సంవత్సరం సన్నద్ధత తర్వాత 2020లో తన మొదటి ప్రయత్నం(పరీక్ష యుపీఎస్‌సీ) చేశారు. యుపీఎస్‌సీ పరీక్షలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయారు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైనప్పటికీ పట్టు వదలలేదు. 2021లో మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మళ్లీ రెండో సారి కూడా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ప్రిలిమ్స్ పరీక్షలో కేవలం రెండున్నర మార్కులతో వెనకబడ్డారు. ఈసారి ఆమెను నిరాశ, సందేహం చుట్టుముట్టాయి. అయితే.. ఆష్నా వైఫల్యం తన విధిని నిర్ణయించనివ్వలేదు. తన తప్పులను విశ్లేషించుకుంటూ.. ప్రిపరేషన్ వ్యూహాన్ని మెరుగుపరుచుకున్నారు.

READ MORE:Rohit Sharma: రోహిత్ ఇంట్రెస్టింగ్ వీడియో.. 99% వర్కౌట్ టైమ్.. ఆ 1% అలా..

కఠిన సాధన.. 116వ ర్యాంక్ 

2022 సంవత్సరంలో తన మూడవ ప్రయత్నం కోసం కష్టపడి చదివారు ఆష్నా. సిలబస్‌ను సవరించడం, మాక్ టెస్ట్‌లు సాధన చేయడం, సమాధానాలు రాయడం, వ్యక్తిత్వానికి పదును పెట్టుకోవడంపై దృష్టి సారించింది. తన బలహీనతలను అధిగమించడానికి అనుభవజ్ఞుల నుంచి సలహాలు పొందారు. 2022 లో ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అంతటితో ఆష్నా.. సంతృప్తి చెందలేదు. యూపీఎస్సీ పరీక్ష తదుపరి దశలు ఆమెకు సవాలుగా మారాయి. అయితే జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్, ఎస్సే, లాంగ్వేజ్ వంటి వివిధ సబ్జెక్టుల్లో తొమ్మిది పేపర్లు ఉండే మెయిన్స్ పరీక్షకు కష్టపడి, పట్టుదలతో సన్నద్ధమయ్యారు. అభ్యర్థి వ్యక్తిత్వం, మానసిక సామర్థ్యం, ​​కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ అవేర్‌నెస్‌ను పరీక్షించే ఇంటర్వ్యూ కోసం కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు. యుపిఎస్‌సి పరీక్షలో అన్ని దశల్లో అనూహ్యంగా రాణించి, పరీక్షకు హాజరైన 10 లక్షల మందికి పైగా అభ్యర్థుల్లో 116వ ర్యాంక్ సాధించారు. 2025 మార్కులకు గానూ మొత్తం 992 మార్కులు పొందారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లోకి ప్రవేశించారు.