Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Aap Releases A List Of 40 Star Campaigners For Gujarat

AAP: స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల.. సీఎం సతీమణికి చోటు

Published Date :April 16, 2024 , 5:08 pm
By Suresh Maddala
AAP: స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల.. సీఎం సతీమణికి చోటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. పార్టీలో అయోమయం నెలకొంది. ప్రచారం ఎవరు నిర్వహిస్తారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆ అనుమానాలను పటాపంచల్ చేస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం ఆప్ విడుదల చేసింది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్లను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Actor Died: ఇండస్ట్రీకి షాక్.. గుండెపోటుతో నటుడు మృతి

ఈ జాబితాలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, రాఘవ్ చద్దా, మంత్రి అతిషి, ఇసుదన్ గాధ్వి తదితరులు జాబితాలో ఉన్నారు. అనూహ్యంగా రాఘవ్ చద్దా పేరు కూడా ఉండడం విశేషం. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాఘవ్ చద్దా ఎక్కడా? కనిపించలేదు. దీంతో ఆయన కూడా అరెస్ట్ భయంతో పరారీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. కానీ అనూహ్యంగా ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Rahe

ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. దీంతో మరిన్ని రోజులు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. కానీ ప్రచారం చేసేందుకు మాత్రం ఆయనకు అవకాశం లేకుండా పోయింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పేరు వెల్లడించారు. మరీ ఆయన ప్రచారం ఎలా నిర్వహిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Yarlagadda VenkatRao: సగరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

Aap

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 40 star campaigners
  • AAP releases
  • Arvind Kejriwal
  • Gujarat
  • manish sisodia

తాజావార్తలు

  • DrivingLicense: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి షాక్.. ఇకపై ఆ టెస్ట్ పాసైతేనే ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు!

  • Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటోలు వైరల్..

  • Leander Paes: బీజేపీలో చేరిన వారానికే లియాండర్ పేస్‌‌కు ఎక్స్ కేటగిరీ భద్రత.. రాజకీయ పార్టీలు ఆశ్చర్యం

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions