బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. సినీ కెరీర్‌లో వందలకొద్దీ సినిమాలో నటించి మంచి విజయాలను సాధించిన ఆమిర్ ఖాన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన మూవీస్ లో ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఆయన బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ అనే కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయి, వాటిలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో మాత్రం కొంత వివాదాలకు గురయ్యారు.
ఆయన మొదట రీనా దత్తాని 1986లో పెళ్లి చేసుకున్నాడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఉన్నారు. అయితే 2002లో వారు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2005లో కిరణ్ రావుతో పెళ్లి చేసుకున్న ఆమిర్, ఆ జంటకు ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నారు. కానీ ఈ బంధం కూడా 2021లో ఈ పెళ్లి కూడా ముగిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్దం అయ్యడట..
ప్రజంట్ ఆమిర్ వయసు 59 ఏళ్లు. అయితే అతను కొంత కాలంగా బెంగళూరుకు చేందిన ఫాతిమా సనా షేక్ అనే ఓ మహిళతో రిలేషన్ లో ఉన్నాడట. ఆమెకు ఈ సినీ రంగంతో ఎలాంటి బంధం కూడా లేదు. ఇక వీరిద్దరి సన్నిహిత ఫోటోలు కూడా వైరల్ కావడంతో, తమ సంబంధం గురించి గాసిప్‌లు పెరిగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు. ఆయన తన మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి సంబంధాలు కలిగి ఉన్నాను అని. అలాగే, తాను త్వరలోనే మూడో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని తెలిపారు. కానీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి మాత్రం చెప్పలేదు. మరి ఎవరు? ఏంటి? అనే విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది.