NTV Telugu Site icon

Aamir Khan Daughter Wedding : గ్రాండ్ గా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి..

Iraa

Iraa

బాలివుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ఈ వయసులో కూడా తగ్గేదేలే అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. ఆయన కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఐరా ఖాన్ వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది.. ఆమె పెళ్లికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అయితే జనవరి 3వ తేదీన నుపుర్ శిఖరేను పెళ్లి చేసుకోనుంది. ఇప్పటితే వీరి వివాహానికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ జంట వివాహం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరుగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంప్రదాయ వేడుకలో పెళ్లి జరగనుందని అబ్బాయి కుటుంబ సభ్యులు తెలిపారు.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రెసెప్షన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి తర్వాత రెండు రిసెప్షన్ పార్టీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 6 నుంచి 10 తేదీల మధ్య ఢిల్లీతో పాటు జైపూర్‌లోనూ రిసెప్షన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అమీర్ ఖాన్ వ్యక్తిగతంగా స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.. ఐరా సమాజ సేవలు చేస్తుంది.. మానసికంగా సరిగ్గా లేని వారికి చేయూతను ఇస్తుంది.. వారికోసం అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది.. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి..

Show comments