NTV Telugu Site icon

Ira Khan: ‘భయంగా ఉంది..’ పెళ్లయిన 4 నెలలకు అమీర్ ఖాన్ కూతురు సంచలన పోస్ట్

Aamir Khan Ira Khan

Aamir Khan Ira Khan

Aamir Khan Daughter Ira Khan Pens A Long Note In Her Latest Post: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లాగా, అతని కూతురు ఐరా ఖాన్ కూడా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉంటుంది. ఐరా ఖాన్‌కు నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఐరా తన ప్రియుడు నూపుర్ శిఖరేతో కలిసి ఏడు అడుగులు వేసి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. నూపూర్ – ఐరాల ఈ వివాహం కూడా చాలా చర్చనీయాంశమైంది. ఈ పెళ్లికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో అప్పట్లో వైరల్‌గా కూడా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐరా పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ చూసిన ఐరా, అమీర్ అభిమానులు కంగారు పడ్డారు. అసలు ఈ పోస్ట్‌లో ఏముందో తెలుసుకుందాం… ఐరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేసింది.

Kalki 2898 AD: హమ్మయ్య… కల్కి అప్డేట్ ఇచ్చేస్తున్నారు.. కాస్కోండి!

ఐరా ఈ పోస్ట్‌లో ‘నేను భయపడుతున్నాను. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. నేను నిస్సహాయంగా ఉంటానని భయపడుతున్నాను. నేను ప్రపంచంలోని అన్ని చెడుల గురించి భయపడుతున్నాను (హింస, వ్యాధి, క్రూరత్వం), నొప్పి వస్తుందని భయపడుతున్నారు. నేను మౌనంగా ఉండడానికి భయపడుతున్నాను, నేను నవ్వడం, పని చేయడం, జీవించడం మీరు ప్రతిరోజూ చూడలేరు, కానీ నేను భయపడినప్పుడు, అది నన్ను ఇబ్బంది పెడుతోంది. ‘నేను ఎప్పుడైనా బాధపడితే, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారని నేను మరచిపోయాను. నేనే సమర్థుడనని మర్చిపోతున్నాను అంటూ కొన్ని లైన్స్ ఇంగ్లీష్ లో రాసుకొచ్చింది. ఐరా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అభిమానులే కాకుండా ఐరా భర్త నుపుర్ శిఖరే కూడా దీనిపై స్పందించారు. దీనిపై నూపూర్ వ్యాఖ్యానిస్తూ, ‘నేను ఇక్కడే ఉన్నాను’ అని కామెంట్ చేశారు.