NTV Telugu Site icon

Aishwarya Rajinikanth :’కొలవెరి’ పాట వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది..

Whatsapp Image 2024 02 12 At 11.06.27 Pm

Whatsapp Image 2024 02 12 At 11.06.27 Pm

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ ‘3’ అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్ మరియు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు ఊపేసింది… యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ చార్ట్ బస్టర్ సాంగ్ సినిమా విజయానికి మాత్రం అంతగా ఉపయోగపడలేదు. ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య మాట్లాడింది.’లాల్ సలాం’ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘3’ సినిమా పరాజయంపై ఐశ్వర్యా రజనీకాంత్ స్పందించారు..

‘వై దిస్ కొలవెరి’ పాట అంత పెద్ద సక్సెస్ అవ్వడం సినిమా కంటెంట్ మీద ప్రభావం చూపించిందని ఆమె అభిప్రాయ పడింది. కంటెంట్ చాలా సీరియస్ గా సాగుతుంది.. కానీ ఈ పాట సినిమాపై భిన్నమైన అంచనాలను నెలకొల్పిందని .పాటను విన్న వారంతా డిఫరెంట్ ఎక్సపెక్టేషన్స్ తో థియేటర్స్ కు వచ్చారు. దాంతో సినిమా వాళ్ళకి నచ్చలేదు.రీ-రిలీజ్ లో ‘3’ చిత్రానికి మంచి ఆదరణ లభించడానికి కారణం అప్పటికి ఆ పాట మ్యాజిక్ తగ్గిపోవడమే అని ఆమె అభిప్రాయపడింది.అయితే ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడినందుకు తాను సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపింది..ఇదిలా ఉంటే ఐశ్వర్య రజనీకాంత్ దాదాపు 9 ఏళ్ల తర్వాత ‘లాల్ సలాం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రజనీకాంత్ స్పెషల్ రోల్ లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయితే ఈ మూవీ తమిళ్ లో మంచి వసూళ్లు రాబడుతోంది కానీ, తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశపరిచింది..

Show comments