Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Aaftab Poonawala Allegedly Dated Doctor After Murder

Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్‎తో డేటింగ్

Published Date :November 27, 2022 , 11:27 am
By Rakesh Reddy
Shraddha Walker Case: శ్రద్ధవాకర్ కేసులో మరో ట్విస్ట్.. హత్య అనంతరం అఫ్తాబ్ డాక్టర్‎తో డేటింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shraddha Walker Case: శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్య అనంతరం విచారణలో అఫ్తాబ్ పూనావాల్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన వెంటనే ఓ మహిళను తన ఫ్లాట్‌కు పిలిచి ఆమెతో అఫ్తాబ్ డేటింగ్ చేశాడు. ఆ మహిళ ఎవరనేది పోలీసులు కూపీ లాగడంతో ఆమె ఒక మానసిక వైద్యురాలిగా పోలీసులు గుర్తించారు. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ ‘బంబ్లే’ ద్వారా ఆ మహిళను అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఇదే బంబ్లే నుంచి రెండేళ్ల క్రితం శ్రద్ధను అఫ్తాబ్ కలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధ హత్యకూ, ఈమెకీ సంబంధమేమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Cyber Crime: నరేశ్ చేతిలో దారుణంగా మోసపోయిన జీవిత రాజశేఖర్

అంతేకాదు, డేటింగ్‌ యాప్‌ ద్వారా మరికొందరు మహిళలను కూడా అఫ్తాబ్‌ కలిసినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో నిందితుడు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో-అనాలిసిస్ పరీక్షలను నిర్వహించారు. పోలోగ్రాఫ్ పరీక్షకు సంబంధించి అన్ని సెషన్లు పూర్తయ్యాయని, ప్రీ, మెయిన్, పోస్ట్ అనే మూడు స్టేజ్‌లు ఈ పరీక్షలో ఉంటాయని ఎఫ్ఎస్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు ఈ పరీక్షలను విశ్లేషించి రిపోర్ట్ రూపొందిస్తారని చెప్పారు. నివేదికపై నిపుణులు సంతృప్తి చెందనట్లయితే మరోసారి అఫ్తాబ్‌ను పిలిపిస్తామన్నారు. నివేదిక ఆధారంగా నార్కో అనాలసిస్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, అంబేద్కర్ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు సోమవారంనాడు నార్కో టెస్ట్ జరుపనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి పుర్రె, మిగిలిన శరీర భాగాలతో పాటు మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన మరో ఆయుధాన్ని పోలీసులు ఇంకా కనుక్కోలేదు. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు ఐదు కత్తులను వినియోగించినట్టు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, ఓ ఆయుధం ఇంకా లభ్యం కాలేదని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aftab Poonawala
  • Bumble
  • Doctor
  • Shraddha Walker

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions