Site icon NTV Telugu

Shambala OTT Release: ఓటీటీలోకి ‘శంబాల’ మూవీ.. ఎక్కడ చుడొచ్చంటే..?

Shambala Ott Release

Shambala Ott Release

Shambala OTT Release: యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘శంబాల’ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుందుకుంది. సూపర్ నాచురల్ అండ్ త్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ‘యుగేందర్ ముని’ తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Victory Venkatesh: మా ఆవిడను అలా పిలిచినందుకు తెగ ఫీలయ్యింది..!

దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో తెరికెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు సాధించి ఆది సాయికుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శంబాల ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ సొంతం చేసుకుంది. దీనితో శంబాల మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

MLA Defection Case: తేలనున్న తెలంగాణ పిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..!

డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను సరిగ్గా నెల రోజులకు దగ్గర్లో అంటే జనవరి 22న స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. థియేటర్స్ లో చూడని వారు, చూసిన వారు కూడా మళ్ళీ ఈ సినిమాను చూసే ఛాన్స్ రాబోతుంది.

Exit mobile version