Site icon NTV Telugu

Shambhala Trailer: ఆది సాయికుమార్‌ .. ‘శంబాల’ ట్రైలర్‌ రిలీజ్

Shambala Trailor

Shambala Trailor

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత.. ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా నేచురల్ స్టార్ నాని..

Also Read : Mrunal Thakur : సరిహద్దులు చెరిపేస్తున్న హీరోయిన్.. మృణాల్

చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే గంభీరమైన డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్, సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. గ్రిప్పింగ్ విజువల్స్ మరియు మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ వీడియో చూస్తుంటే, ఆది ఈసారి ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ‘శంబాల’ రహస్యం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

Exit mobile version