Site icon NTV Telugu

Aadi Sai Kumar: మరోసారి హారర్ త్రిల్లర్‌నే నమ్ముకున్న ఆది సాయికుమార్..

Aadi Sai Kumar

Aadi Sai Kumar

Aadi Sai Kumar: రీసెంట్‌గా ‘శంబాల’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు హీరో ఆది సాయి కుమార్. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ హీరో. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

READ ALSO: Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..

ఈ మూవీని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయనున్నారు. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ వేదిక పాత్ర కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

READ ALSO: Tollywood strike: టాలీవుడ్‌లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..?

Exit mobile version