Aadhaar PAN Link: భారత దేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిబంధనలను ప్రకటించింది. డిసెంబర్ 31లోపు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును అనుసంధానం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీనికి ఇక ఒక రోజే గడువు మిగిలి ఉంది. నిర్ణీత తేదీ లోపు లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పనిచేయకుండా (డీఆక్టివ్) చేయబడుతుంది.
AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?
పాన్ కార్డు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం సాధ్యం కాదు. అలాగే బ్యాంక్ ఖాతా, ముఖ్యంగా సాలరీ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి. రోజుకు రూ.50,000కు పైగా నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా చేయాలన్నా పాన్ నంబర్ అవసరం. పాన్ డీయాక్టివ్ అయితే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ చేయలేరు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ లబ్ధులు పొందాలన్నా పాన్ కీలకం. పాన్ లేకుండా లోన్లు, వాహనం కొనుగోలు, ఇల్లు కొనుగోలు చేయడం కూడా కష్టమవుతుంది. అలాగే రూ.50,000కు పైగా లావాదేవీలు, రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తుల కొనుగోలు లేదా విక్రయాలు చేయాలన్నా పాన్ అవసరం. అందువల్ల పాన్ డీఆక్టివ్ అయితే అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వెంటనే ఆధార్–పాన్ లింక్ చేయడం మంచిది.
ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్–పాన్ లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం UIDPAN <12 అంకెల ఆధార్ నంబర్> స్పేస్ <10 అంకెల పాన్ నంబర్> పెట్టి దీనిని 567678 లేదా 56161 నంబర్‌కు పంపాలి. లింక్ విజయవంతమైతే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆధార్, పాన్ రెండింటిలోనూ మీ పేరు, జన్మతేది, లింగం వంటి వివరాలు ఒకేలా ఉండాలి. అలా ఉంటే వెంటనే నిర్ధారణ సందేశం వస్తుంది. అనంతరం వచ్చే లింక్ ద్వారా రూ.1,000 ఫీజు చెల్లించాలి.
Jalsa vs Murari: న్యూ ఇయర్ ఈవ్‌కి జల్సా, మురారి రీరిలీజ్ క్లాష్.. ఫ్యాన్స్ సందడి మాములుగా లేదుగా..!
ఆన్లైన్లో ఆధార్–పాన్ లింక్ ఎలా చేయాలంటే..
* మొదటగా ఇన్కమ్ ట్యాక్స్ e-Filing వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* హోమ్ పేజీలో ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
* స్క్రీన్‌పై చూపిన సూచనలు అనుసరించి ఫీజు చెల్లించాలి.
* అభ్యర్థన సమర్పించిన తర్వాత లింకింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే వెంటనే నిర్ధారిస్తారు.
