Aadhaar:ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఇంకా ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదా? కానీ ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది. 14 డిసెంబర్ 2023 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఆధార్ పత్రాలను అప్‌డేట్ చేయడానికి డబ్బులు చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న తేదీ నుండి 10 సంవత్సరాలు నిండిన వారు తగిన పత్రాలను సమర్పించి, అందులో ఉన్న వివరాలను అప్‌డేట్ చేయాలని ఉడయ్ గతంలో సూచించింది. ఇకనుండి, ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకు ఒకసారి గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో వివరాలను అప్‌డేట్ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు CIDRలో అప్ డేట్ అవుతుందని, ఇది కచ్చితమైన సమాచారానికి దోహదపడుతుందని చెబుతున్నారు.
Read Also:Mumbai : ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
ఆధార్ తీసుకుని పేదేళ్లు పూర్తి చేసుకున్న వారు తమ జనాభా వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం UIDAI వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి తాజా గుర్తింపు కార్డు, చిరునామా వివరాలను సమర్పించాలి. రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, కిసాన్ ఫోటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ గుర్తింపు చిరునామా రెండింటికీ ధృవీకరణ పత్రాలుగా ఉపయోగించవచ్చు. టీసీ, మార్క్ షీట్, పాన్/ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ను గుర్తింపు రుజువుగా ఉపయోగించుకోవచ్చని UIDAI తెలిపింది. విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్ బిల్లులు (మూడు నెలలకు మించకుండా) చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చని UIDAI చెప్పారు. ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన కాపీలను ‘మై ఆధార్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.