Site icon NTV Telugu

Youngster Hulchul : ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు హల్‌చల్‌

Suicide Attempt

Suicide Attempt

a youngster suicide attempt at petbasheerabad

తాను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటూ దూలపల్లిలో ఓ భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపులకు దిగాడు యువకుడు. అయితే.. ఆ యువకుని నచ్చచెప్పి పేట్ బషీరాబాద్ పోలీసులు కిందకి దించారు. అనంతరం ఆ యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే.. ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటూ యువకుడు భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంటూ నల్గొండ జిల్లా కి చెందిన‌ ఆటో డ్రైవర్ ఆంజనేయులు బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా.. తానే స్వయంగా 100కు ఫోన్ చేయగా స్థానిక పేట్ బషీరాబాద్ పోలీసులు వచ్చి స్దానికుల సహకారం తో బిల్డింగ్ పైకి చేరి అతనికి నచ్చ చెప్పి క్రిందకి దించారు. ఆ తరువాత పేట్ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. ఇక ముందు ఇలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని మందలించి ఆంజనేయులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉంటే.. వికారాబాద్ పట్టణంలోని ధర్మ విద్యాలయం స్కూల్ దగ్గర చెట్టు ఎక్కి హంగామా సృష్టించాడు ఓ యువకుడు.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. యువకుడును చెట్టు పైనుండి కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడంతో.. చెట్టు మీద నుండి కిందికి దూకాడు యువకుడు. అయితే.. చెట్టు మీద నుండి కిందికి దూకడంతో ఒక కాలు విరిగింది. దీంతో.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా.. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను మాట్లాడుతూ.. నాలుగు గంటల నుండి చెట్టు పైనుంచి కిందికి దించడానికి ఎంతో శ్రమించినప్పటికీ కిందికి దించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు పడిపోయాడని వెల్లడించారు.

 

Exit mobile version