NTV Telugu Site icon

Bride Cheating: నిత్య పెళ్లికూతురు.. నాలుగు రాష్ట్రాలు, 8 పెళ్లిళ్లు

Bride Chetting

Bride Chetting

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. కొంతరు సైబర్ మోసగాళ్లైతే.. మరికొందరు పెళ్లిళ్ల కేటుగాళ్లు తెగబడ్డారు. ఇందులో యువకులకు తీసిపోని విధంగా యువతులు తయారయ్యారు. డబ్బున్న మగాళ్లకు ప్రేమ వలవేసి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత డబ్బు, నగలతో పరార్ అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఫైనాన్షియర్ సేమ్ ఓ లేడీ కీలాడి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి కోసం గాలిస్తున్నారు.

Read Also: Titan Tragedy: టైటాన్ పేలుడుకు కొన్ని సెకన్ల ముందు చనిపోతున్నామని వారికి తెలిసింది..

అయితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి ఇన్ స్టాగ్రామ్ లో రషీద అనే యువతితో స్నేహ్నం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా.. ప్రేమకు దారితీసింది. ఈ ఏడాది మార్చి 30న ఇద్దరూ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో రషీద జులై 4న ఇంట్లో ఉన్న రూ. 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం తీసుకుని ఇంటి నుంచి ఎక్కడికో పరార్ అయింది.

Read Also: MLA Sridhar Babu: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై.. కాంగ్రెస్‌పై కక్ష సాధింపు చర్యలు చేపడతున్నాయి

దీంతో ఇంటికి వచ్చిన ఫైనాన్షియర్ మూర్తి చుట్టుపక్కల వెతిగాడు.. ఎక్కడ కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రషీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి డబ్బున్న మగాళ్లతో పరిచయం పెంచుకుని, వారితో ప్రేమాయణం కొనసాగించి.. పెళ్లి చేసుకుని.. ఆఖరికి ఇలా డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ రషీద కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 మందిని పెళ్లిళ్లు చేసుకుని ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించామన్నారు. రషీద కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.