Site icon NTV Telugu

Andhra Pradesh: వినాయక మండపంలో విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: ప్రాణాలు ఎప్పుడు.. ఎలా పోతాయో చెప్పలేం అంటుంటారు పెద్దలు.. అయితే, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రోగాలకు వైద్యం అందుతోంది.. అది కొందరికే పరిమితం అవుతోంది.. మరోవైపు.. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే గుండెఆగి ఎంతో మంది మరణిస్తున్నారు.. నైట్‌ పడుకున్నవాడు పొద్దున్నే లేస్తాడా లేదా? అనే అనుమానం కలుగుతోంది.. ఎందుకంటే.. ఎవరికి ఎప్పుడు ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడంలేదు.. మరోవైపు.. ఈ మధ్య సరదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటి కప్పుడే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్ లో బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డ్యాన్స్‌లు చేశారు కొందరు యువకులు.. స్థానికులంతా కలిసి ఆడుతూ పాడుతూ గడిపారు.. కొందరు డ్యాన్స్‌ చేస్తుంటే.. మరికొందరు వారిని ఉత్సాహ పరిచారు.. అయితే, ప్రసాద్‌ అనే 26 ఏళ్ల యువకుడు డ్యాన్స్‌ చేస్తూ చేస్తూనే కుప్పకూలిపోయాడు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో.. స్థానికంగా విషాయచాయలు అలుముకున్నాయి.

Read Also: Indian Army Jobs: పది అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

Exit mobile version