ఆర్థికంగాను, స్థలం విషయంలోనూ స్నేహితులు మోసానికి పాల్పడ్డారని మనస్తాపం చెంది, తన చావుకు స్నేహితులు కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మందమర్రికి చెందిన రాజేష్(32) మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో తన భార్య కుష్మల తో కలిసి నివసిస్తూ, ఐటి కన్సల్టెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని ఇంటి నుండి బయటకి వెళ్లిన రాజేష్, రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో, కుష్మల అతడి ఫోన్ కు కాల్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి ఈ ఫోన్ ప్రగతి నగర్ చెరువు వద్ద పడి ఉన్నట్లు తెలిపాడు.
AP Excise Policy: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు యంత్రాంగం సిద్ధపడాలి..
అక్కడికి చేరుకున్న కుష్మల, ఫోన్ తీసుకొని చూడగా *అందులో ఓ సెల్ఫీ వీడియోలో తనను స్నేహితులైన బొంతల వినయ్, కొత్తపల్లి శ్రీనివాస్ లు ఆర్థిక లావాదేవీలలో, ఓ స్థలం విషయంలో మోసం చేయటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు వీడియో లభించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రగతి నగర్ చెరువులో గాలించగా రాజేష్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.
Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..