Site icon NTV Telugu

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

America Road

America Road

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆదివారం ట్వీట్ చేసింది. ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది.

Read Also: Wines Close: కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్..

జోషి మృతదేహాన్ని ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులకు అందించేందుకు ఎన్జీవో బృందం కూడా సహకరిస్తోంది. టీమ్ ఎయిడ్ ముఖ్యంగా విదేశాలకు వెళ్లే లేదా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు సహాయం చేస్తుంది. ఈ విషాదకర సంఘటన మమ్మల్ని కూడా గుండె పగిలేలా చేసిందని టీమ్ ఎయిడ్ వ్యవస్థాపకుడు మోహన్ నన్నపనేని తెలిపారు. గత వారంలోనే టీమ్ ఎయిడ్ ఐదుగురి అస్థికలను భారత్‌కు పంపింది. నన్నపనేని మరియు అతని బృందం ప్రస్తుతం అమెరికా, కెనడాలో ఉన్నారు.

Read Also: BJP: “కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ నుంచి నేర్చుకోవాలి”.. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్స్..

Exit mobile version