దర్శకుడిగా, హీరోగా డబుల్ సక్సెసైన ప్రదీప్ రంగనాథ్ నెక్ట్స్ టూ ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. రెండూ కూడా యూత్‌ను ఎట్రాక్ట్ చేసే లవ్ స్టోరీలే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తోన్న లవ్ ఇన్య్సురెన్స్ కంపనీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్‌ని రెడీ చేస్తున్నాడు. ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడంతో తన సినిమాలకు వాటినే కంటిన్యూ చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు పెద్ద ఇరకాటంలో పడ్డాడు. లవ్ టుడే, డ్రాగన్‌తో హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టి మరో యంగ్ హీరో సాధించని రేర్ ఫీట్ కొట్టేసిన ఈ జూనియర్ ధనుష్ నెక్ట్స్ మూవీతో మరో వంద కోట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తుంటే పెద్ద చిక్కొచ్చి పడేట్టుగానే కనిపిస్తోంది.
Also Read ల : Megastar Chiranjeevi : మన శంకరవరప్రసాద్ పండగకి వస్తున్నారు’ గ్లిమ్స్.. అంతా ఒకే ఆ ఒక్కటి తప్ప..
శివకార్తీకేయన్ నుండి ప్రదీప్ చేతికి చేరిన లవ్ ఇన్స్యురెన్స్ కంపనీ అన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ నుండి అక్టోబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ డ్యూడ్ కూడా దీపావళికే రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్. నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. డ్యూడ్ వచ్చిన రోజే లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ కూడా వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రదీప్ ను టెన్షన్ పెడుతోంది. మినిమం గ్యాప్ తో అయినా వస్తే కలెక్షన్స్ రాబట్టి మార్కెట్ పెంచుకోవచ్చు అని ఫీల్ అవుతున్నాడు. కానీ ప్రదీప్ మాట వినేవారు ఎవరు.
