ఒక వ్యక్తి తన జీవితాన్ని గడపడానికి ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే ఉద్యోగం చేస్తేనే.. వచ్చిన డబ్బులతో లైఫ్ లో బ్రతకగలం. అయితే కొందరు తాము చదువుకున్న చదువులకు చేసే ఉద్యోగాలకు పొంతన ఉండదు. మరికొందరు తమ ట్యాలెంట్ తో ఉద్యోగాలు చేసి అధిక డబ్బు సంపాదిస్తారు. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోని వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కంటే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా సరే.. డబ్బుల కోసం చేసేస్తున్నారు. అయితే అసలు విషయానికొస్తే.. కేవలం ట్రక్కు నడుపుతూ నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తుంది ఓ మహిళ. ఇప్పుడు ఈమే గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు.
Pooja Hegde : మాస్ రాజా రవితేజ సినిమాలో నటించబోతున్న బుట్టబొమ్మ..?
ఓ మైనింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ట్రక్ డ్రైవర్ యాష్లే.. నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తుంది. ఆ పరిశ్రమలో పని చేయాల్సింది కేవలం ఆరు నెలలు మాత్రమే.. మిగతా ఆరు నెలలు విశ్రాంతి. అందులోనే తినడం, అందులోనే పడుకోవడం అన్నీ పూర్తిగా ఉచితం. ఐతే ఇలాంటి పరిశ్రమల్లో పనులు చేయాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అలాంటి వాటిల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయాలి.. అయితే అలా చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే అన్నింటికీ ఒప్పుకుని యాష్లే అందులో చేరింది. ఆ పరిశ్రమలో ట్రక్కు నడుపుతుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Aasara Pension: దివ్యాంగులకు శుభవార్త.. ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్
అసలు విషయమేంటంటే.. 6 నెలలు ఖాళీగా ఉండే సమయంలో ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చేసి పెడుతుంది. ఆమెకు 70 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే కేవలం ఆరు నెలలు మాత్రమే పని చేసినందుకు $110,000 జీతం పొందినట్లు చెబుతుంది. ప్రారంభంలో సంవత్సరానికి సుమారు $94,000 వచ్చేదని తెలిపింది. యాష్లే మాట్లాడుతూ.. తాను ఇప్పుడు పని చేస్తున్న సంస్థ ప్రతి నెల బోనస్ $2000 ఇస్తుంది. దాన్ని కలిపితే సంవత్సరం సంపాదన సుమారు 122,000 డాలర్లు అని చెప్పింది. అయితే యాష్లేను ఇనిస్పిరేషన్ గా తీసుకుని.. ఆమే వీడియోలు చూసి అలాంటి జీవితాన్ని గడపాలని చాలా మంది చెబుతున్నారు.
