NTV Telugu Site icon

Viral Video: బాత్రూంలోని కమోడ్‌లో ‘పాము’.. చూస్తే ఖంగుతినాల్సిందే

Snake

Snake

పాములంటే భయపడని వారు ఎవరు ఉండరు. వాటిని చూస్తేనే ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది అనుకోకుండా అవి మన ఎదురుపడితే ఇంకేముంది. అక్కడే చిచ్చు పోసుకోవాల్సిందే. అయితే ఇలాంటి సంఘటనే అరిజోనాలోని ఓ మహిళకు ఎదురైంది. బాత్రుంలోకి ప్రవేశించిన మహిళ.. అక్కడ కమోడ్ లోపల ఉన్న నల్లటి పామును చూసి ఖంగుతిన్నది. అందులో పామును చూసి భయంతో కేకలు వేసుకుంటూ బయటకు వచ్చింది.

Read Also: Ntr : కంగ్రాట్స్ బావ.. పార్టీ లేదా మరి..

అసలు విషయానికి వెళ్తే.. 4 రోజుల పాటు ఆ ఇంట్లో నివసించే మహిళ మిచెల్ లెస్ప్రాన్ అవసరం నిమిత్తం బయటకు వెళ్లింది. అయితే ఆ తర్వాత ఇంటికి వచ్చిన మహిళ.. సడన్ గా బాత్రూంకు వెళ్లి చూడగానే.. కమోడ్ లో పాము ఉన్నట్లు కనిపించింది. దీంతో వెంటనే స్నేక్ సొల్యూషన్స్‌కు ఫోన్ చేసింది. తమ బాత్రూంలో ఓ పాము ఉందని.. పట్టుకోవాలని కోరింది.

Read Also: Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?

సమాచారం అందుకున్న స్నేక్ బృందంలోని ఓ వ్యక్తి సంఘటనా స్థలానికి చేరుకుని కమోడ్‌లో చేయి వేసి పామును పట్టుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి మరో చేత్తో సెల్‌ఫోన్‌ పట్టుకుని వీడియో రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము పొడవు 3 నుంచి 4 అడుగుల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఇది కోచ్‌విప్ పాము, ఇది సన్నగా మరియు వేగంగా క్రాల్ చేసే పాములలో ఒకటి. ముఖ్యంగా నైరుతి అమెరికాలోని ఎడారుల్లో ఈ పాములు కనిపిస్తాయని చెబుతున్నారు.