Site icon NTV Telugu

Viral Video: ఏం ఐడియా గురూ.. మండే ఎండల నుంచి ఇలా తప్పించుకోండి..

Viral Spinkers

Viral Spinkers

ప్రస్తుతం దేశంలో ఈ ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటల దాటిందంటే చాలు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. అంతలా ఉదయం కాలమే సూర్యుడు భగభగమంటూ ప్రజలపై ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో ఎండ వేడిమినీ తట్టుకునేందుకు ఫాన్స్, కూలర్లు, ఏసీలు లాంటివి ఏర్పాటు చేసుకొని ఎండ నుంచి కాస్తైనా విముక్తుని పొందుతున్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఎండ వేడిమి నుండి బయట పడేందుకు సంబంధించిన వీడియో.. వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించి వివరాలు చూస్తే..

Also read: TS Inter Supplementary: అలర్ట్.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రీ షెడ్యూల్డ్ తేదీలు ఖరారు..

వైరల్ గా మారిన వీడియోలో ఇంటిపై చిన్న పైపులతో పొలంలో ఉపయోగించే స్పింకర్స్ ను వాడి ఇంటి మీద నీళ్లు పడేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వీడియోలో ఉన్న ఇంటిని చూస్తే ఇంటిని పెంకులతో నిర్మాణం చేశారు. పెంకులతో నిర్మాణం చేసిన ఈ ఇంటిపై స్పింకర్స్ ను ఉపయోగించి నీటిని వాటి మీద పడేలా ఏర్పాటు చేశారు.

Also read: DC vs MI: ఉత్కంఠ పోరులో ముంబైపై నెగ్గిన ఢిల్లీ..

ఇంటి మధ్యలో పొడవాటి భాగానికి మొత్తం మూడు స్ప్రింకర్లను ఏర్పాటు చేసి నీటిని ఇంటికి అన్ని వైపుల పడేలా స్పింకర్స్ ను ఏర్పాటు చేసి నీళ్లతో ఇంటి పై భాగాన్ని తడుపుతున్నారు. దీంతో ఇంటి పైభాగం చల్లబడటంతో ఇంట్లోని వారికి బయట ఉన్న వెచ్చదనం కనిపించకుండా చల్లగా ఉంటుంది. ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజెన్స్.. అసలు మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటుండగా.. మరికొందరైతే ఇలాంటివి మా ఇంటి పైన కూడా ఏర్పాటు చేసుకొని వేసవి కాలంలో చల్లగా ఉండేందుకు ప్రయత్నిస్తామని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version