NTV Telugu Site icon

Viral Video: అబ్బబ్బబ్బా.. చిన్నారి ఎంతబాగా పాడిందంటే.. వింటే ‘వావ్’ అనుకూండా ఉండలేరు..

Angelica Nero

Angelica Nero

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమంలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువగా హాస్య భరితమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకు లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఏంజెలికా నీరో (Angelica Nero) అనే 3 ఏళ్ల బాలిక టైటానిక్ చిత్రంలోని “మై హార్ట్ విల్ గో ఆన్” అనే ఐకానిక్ పాటను పాడటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎమిల్ రీనెర్ట్ అనే పియానిస్ట్ పియానో వాయిస్తున్న సమయంలో చిన్నారి పాట పడుతున్న వీడియో ఆన్‌లైన్‌ లో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది.

Suicide Attempt: సూసైడ్‌ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, అప్పటికే పియానో ​​వాయిస్తున్న ఎమిల్‌ (Emil Reinert)ని ఐకానిక్ పాటను ప్లే చేయమని ఏంజెలికా అడగడం మనం చూడవచ్చు. ఎమిల్ దాంతో పాటను ప్లే చేయడం ప్రారంభించాడు. అతను ప్రారంభించిన వెంటనే, ఏంజెలికా చ్ఛమైన ఆనందంతో నవ్వడం చూడవచ్చు. ఆ తర్వాత చిన్నారి పాప “మై హార్ట్ విల్ గో ఆన్” అని పాడటం ప్రారంభించింది. మధురమైన ట్యూన్‌ తో జత చేసిన ఆమె మనోహరమైన స్వరం అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను పియానిస్ట్, ఏంజెలికా ఖాతాల ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో అప్లోడ్ అయినప్పటి నుండి అది వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి ఊహించని స్పందన లభించింది.. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

Answer Sheet Evaluation: వినూత్న ప్రయోగం.. తమిళనాడులో ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం..

అంత చిన్న చిన్నారి అంత మధురంగా పాట పాడుతుందని అస్సలు ఊహించలేదంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.. మరికొంతమంది., అంత చిన్న వయసులో ఇలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ వీడియోని చూసి మీకేమి అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments