No Sick Leaves: కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించిన వింత రూల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కచ్చితంగా ఇన్ని గంటల పని చేయాల్సిందే, సమయానికి తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిందే లాంటి కొన్ని చిత్ర విచిత్రమైన రూల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఆర్డర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌లో ఓ కంపెనీ అంటించిన ఆర్డర్ కాపీ ఫోటో కనిపిస్తుంది.
Also Read: Pushpa 2: కిస్సిక్ కస్సక్ అనిపించేది ఆరోజే!!
దీని ప్రకారం.. ఇక్కడ పనిచేసే వ్యక్తులు డిసెంబర్ 31 వరకు సెలవు తీసుకోలేరు. ఇది మాత్రమే కాదు, అనారోగ్యం పాలైనప్పటికీ సిక్ లీవ్ తీసుకోవడం నిషేధించబడింది. అయితే ఇందుకు కారణాన్ని కూడా తెలిపింది కంపెనీ. ఈ సమయంలో అత్యంత రద్దీ ఉంటుందని, ఆ సమయంలో చాలా పని ఉందని అందువల్ల సెలవులు ఇచ్చే అవకాశం లేదని కంపెనీ చెబుతోంది. అయితే, ఈ పోస్టర్ చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రూల్ ఏ కంపెనీ వారు పెట్టారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ఈ పోస్టును సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా కంపెనీపై మండిపడుతున్నారు. ఒకవేళ కంపెనీలో పనిచేసే వారందరికీ ఒకేసారి అనారోగ్యం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో ఇలాంటి తలతిక్క రూల్స్ పెట్టె కంపెనీలపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.
Why does corporate think this is ok?
byu/Goodn00dl3 inmildlyinfuriating