NTV Telugu Site icon

Viral Video: ఫోన్‌కి బానిసగా మారుతున్న పిల్లలకోసం ఉపాధ్యాయురాలి అద్భుత ఆలోచన..(వీడియో)

Viral Teacher

Viral Teacher

Viral Video: పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఇబ్బంది పడే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమాషాగా పిల్లలకు ఫోన్లు ఇస్తుంటారు. కానీ., ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఇష్టమైన ఆటవస్తువుగా మారాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్‌ ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిని చూసి సోషల్ మీడియాలో టీచర్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్‌లోని ఒక పాఠశాల అవగాహన ప్రణాళిక వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

AUS vs ENG: ఇంగ్లాండ్‭కు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్లో 30 పరుగులు..

బదౌన్‌ లోని హెచ్‌పి ఇంటర్నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులు కలిసి పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచేందుకు అవగాహన ప్రణాళికను రూపొందించారు. ఈ వీడియోలో, ముందుగా ఒక టీచర్ కళ్లకు ఓ రుమాలు అడ్డుపెట్టుకొని ఏడుస్తున్నట్లు నటిస్తున్నారు. ఇతర ఉపాధ్యాయులు భయంతో ఆమెను చుట్టుముట్టి, “ఏమైంది మేడమ్, ఇది ఎలా జరిగింది..?” అని అడుగుతారు. టీచర్ ఇంగ్లీషులో, “నేను ఫోన్ ఎక్కువగా వాడాను, అందుకే ఇలా జరిగింది.” అంటూ సంధానం ఇచ్చింది. దీని తర్వాత వీడియోలో చూసిన పిల్లలు భయపడుతున్న దృశ్యాలు కనపడతాయి.

తమ టీచర్‌ పరిస్థితిని చూసి పిల్లలు ఫోన్‌ని చూస్తూ దూరంగా వెళ్లిపోతారు. ఒక టీచర్ పిల్లలందరికీ ఫోన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. కానీ., ఎవరూ ముందుకు రాలేదు. చాలామంది పిల్లలు కూడా ఇంకెప్పుడూ ఫోన్ వాడను అని ఏడుస్తూనే ఉన్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో 6 లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉపాధ్యాయురాలు చేసిన పనిని, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు. చాలా అద్భుతమైన వీడియో, చాలా మంచి సందేశం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Show comments