NTV Telugu Site icon

Misbehaving: నన్ను తన గదికి పిలిచాడు.. పోలీస్ అధికారి పై ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు

Traini Si

Traini Si

యూపీలోని ఆగ్రా సిటీ జోన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో నియమించబడిన ఇన్‌స్పెక్టర్‌పై ట్రైనీ ఇన్‌స్పెక్టర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై ఒత్తిడి చేసి ఇన్‌స్పెక్టర్ తనను గదికి పిలిచారని ఆరోపించారు. ఈ ఘటనపై ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. రెండు రోజుల్లో ఏసీపీ ఎత్మాద్‌పూర్ సుకన్య శర్మ నుంచి విచారణ నివేదిక కోరారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇన్ స్పెక్టర్ ఫోన్ లో అసభ్యకర మాటలు మాట్లాడేవారని ట్రైనీ ఇన్‌స్పెక్టర్ తెలిపింది. అంతేకాకుండా.. స్టేషన్ లో కూడా అలాంటి వ్యాఖ్యలు చేసేవారని పేర్కొంది. హోలీ రోజున తనను పోలీస్ స్టేషన్లో ఉంచి.. తప్పు చేసేందుకు ప్రయత్నించారని చెప్పింది. తాను చెప్పినట్లు వినకుంటే బెదిరించారని తెలిపింది. అంతేకాకుండా.. తన నివాసంలో పడుకో అన్నాడని బాధితులు పేర్కొంది. అతను తనను పోలీస్ స్టేషన్ బయట రూమ్ తీసుకోవాలని వేధించేవాడని చెప్పింది. ఈ క్రమంలో.. మార్చి 17వ తేదీని తాను పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ కమిషనర్ కు వినతిపత్రం రాసింది. అనంతరం.. ఆమె సెలవుపై వెళ్లింది.

Read Also: Foods for Kids: ఈ ఆహార పదార్థాలు తింటే పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగు..

ఆ వినతిపత్రంలో తనను ఇంట్లో పెళ్లికి నిరాకరించమని ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారని ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్ ఆరోపించింది. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడన్నారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. మరోవైపు.. జూన్ 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అతను కాల్ చేశాడని.. బయట వేడిగా ఉంది.. తన గదిలో ఏసీ ఉంది. వచ్చి పడుకో అని అన్నారని తెలిపింది. ప్రతిరోజు అతని కులం గురించి చెబుతుండేవాడని.. అతను షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని దరఖాస్తులో తెలిపింది. ఈ క్రమంలో.. అతనిపై తగిన శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని వేడుకొంది.

ఈ కేసు గురించి డీసీపీ సిటీ సూరజ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. ఈ ఫిర్యాదుకు ముందు ట్రైనీ మహిళా ఇన్‌స్పెక్టర్‌పై కూడా ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ రెండు కేసులను ఏసీపీ ఎత్మాద్‌పూర్ సుకన్య శర్మ విచారించనున్నారని చెప్పారు. రెండు రోజుల్లో నివేదిక ఇస్తామని.. విచారణ నివేదిక ఆధారంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.