NTV Telugu Site icon

Delhi Girl : ఢిల్లీలో ఘోరం.. దేశానికి కాదు దారుణాలకు రాజధాని

Girl Rape

Girl Rape

Delhi Girl : దేశ రాజధానిలో వరుసగా మహిళలపై అత్యాచార పర్వాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలపైనే కాకుండా అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతూ కామాంధులు వికృతానందం పొందుతున్నారు. తాజాగా ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరికి చెందిన మూడేళ్ల బాలిక శుక్రవారం ఉదయం కనిపించకుండా పోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి పొరిగింటికి చెందిన ఓ వ్యక్తి తారసపడ్డాడు.

Read Also: Wedding procession: అందరిలా చేస్తే ఏముంటది.. వెరైటీ ఉండాల్సిందే

తాను చిన్నారిని ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతంలో చూశానని సమాచారం అందించాడు. ఇద్దరు వ్యక్తులు ఆ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు వారు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిన్నారి గాయాలతో ఏడుస్తూ వారికి కనిపించింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చికిత్స కోసం చిన్నారిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రామ్ నివాస్ పానిక(27), శక్తిమాన్ సింగ్(22) గా గుర్తించారు. వీరిద్దరికి వివాహమైందని, స్థానికంగా ఓ గార్బేజ్ రీసైకిల్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Mulugu Accident: కరెంట్‌ స్థంభానికి ఢీ కొట్టిన ఆటో.. స్పాట్‌ లోనే మహిళ మృతి..