Site icon NTV Telugu

West Bengal: విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

Student

Student

పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు పాఠశాలలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరగణ జిల్లాలోని ఓ స్కూల్ లో.. జూలై 21న జరిగింది. విద్యార్థిని వాష్రూమ్ కి అని వెళుతుంటే వెంబడించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో.. నిందితుడు విద్యార్థిని కొట్టి వాష్‌రూమ్‌లో పెట్టి తలుపు వెయ్యటానికి ప్రయత్నించాడు.

Health Tips :రోజూ రాత్రి దీన్ని తీసుకుంటే..శరీరంలో ఉండే కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది..

వెంటనే బాలిక కేకలు విన్న తోటి స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ బాలికను రక్షించి.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై బాలిక తల్లి స్కూల్ సిబ్బందిని, మేనేజ్మెంట్ ను ప్రశ్నించగా.. వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

Minister Audimulapu Suresh: మాదిగలంతా రుణపడి ఉంటారు.. ఆ కేసుల మాఫీకి సీఎం అంగీకారం

మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఢోలాఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సోచట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఢోలాఘాట్ హై మదర్సా ప్రాంతంలో నివాసముంటుండగా.. సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

Exit mobile version