ప్రస్తుతం సమాజంలో చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు కొందరు కీచకులు లైంగికంగా వేధిస్తుంటారు. తమ కామ కోరికలను తీర్చుకునేందుకు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే, ఈ విధమైన లైంగిక చర్యలు ప్రతి చోటు జరుగుతునే ఉన్నాయి. కానీ.. అందరికి చదువు చెప్పే ఉపాధ్యాయులే కామ రాక్షసులు అయితే.. అక్కడ చదివే పసి పిల్లల భవిష్యత్ సర్వ నాశనం అవుతుంది. అలాంటి కీచక టీచర్ చేసిన పని ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి నెలకొంది.
Read Also: Tomato Price: అక్కడ టమాటా ధర కిలో రూ.250.. బెంబేలెత్తుతున్న జనాలు..!
తాజాగా.. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లోని శ్రీ సాయి హై స్కూల్ దారుణం జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 4వ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిపై రాజ్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ గత ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం బయటకు వచ్చింది. ముషీరాబాద్ లోని ఎస్ఆర్ కే నగర్ లోని శ్రీ సాయి హై స్కూల్ లో బాలిక ప్రస్తుతం 4వ తరగతి చదువుతుంది.
Read Also: Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
అయితే ఇంట్లో ఉన్న బాలికను తండ్రి పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని పలుమార్లు ప్రశ్నించాడు. అయితే.. తనను స్కూల్ మార్చాలని తల్లిదండ్రులను ఆ బాలిక కోరింది. ఎందుకు అని అడగటంతో.. రాజ్ కుమార్ అనే మాథ్స్ టీచర్ సంవత్సరం నుంచి తన శరీరంపై ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ లైంగికంగా వేదిస్తున్నట్లు తల్లిదండ్రులకు ఆ విద్యార్థినీ చెప్పుకొచ్చింది. దీంతో టీచర్ రాజకుమార్ ను పట్టుకుని దేశ శుద్ధి చేసి ముషీరాబాద్ పోలీస్ లకు బాలిక తల్లిదండ్రులు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసుకుని ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
