NTV Telugu Site icon

Rajini Kanth : ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సూపర్ స్టార్

Coolie

Coolie

Rajini Kanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా లెక్కకు మించిన అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన మ‌ళ్లీ ఆగ‌స్ట్ హిట్ సెంటిమెంట్ రిపీట్ కి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `జైల‌ర్` 2023 ఆగ‌స్టు 10న విడుదలై వరుస ఫ్లాపులు అందుకుంటున్న ఆయనకు మరో భారీ విజయం తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ కెరీర్ లో మ‌రో బ్లాక్ బ‌స్టర్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగుతో గ‌తేడాది `లాల్ స‌లామ్`, `వెట్టేయాన్` చిత్రాలు విడుదల అయ్యాయి. `లాల్ స‌లామ్` ఫిబ్రవరిలో, `వెట్టేయాన్` అక్టోబ‌ర్ లోనూ భారీ అంచ‌నాల మ‌ధ్య థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయాయి. రెండు సినిమాలు కనీసం నిర్మాలు పెట్టిన బ‌డ్జెట్ రిక‌వ‌రీ కూడా చేయ‌లేక‌పోయాయి. `వెట్టేయాన్` సినిమాకు కథా పరంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినా క‌మ‌ర్శియ‌ల్ గా మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీంతో ర‌జ‌నీకాంత్ మ‌రోసారి ఆగ‌స్టు సెంటిమెంట్ నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది.

Read Also:PM Modi: కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ రాక.. గంట పాటు రోడ్ షో

ప్రస్తుతం లోకేష్ క‌న‌గరాజ్ దర్శకత్వంలో `కూలీ`సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు ఇదో శుభవార్త కానుంది. అలాగే వర్సటైల్ యాక్టర్ విక్ర‌మ్ హీరోగా `వీర ధీర శూర‌న్` విడుదల పై కూడా ఇంత వ‌ర‌కూ క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో ఆ సినిమా విడుదల అయ్యేది అప్పుడే అని ఊహాజనితమైన తేదీ తెరమీదకు వచ్చింది. జ‌న‌వ‌రి 30 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వ‌చ్చే వారం రానుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది.

Read Also:Vassishta: హీరో టు మెగా డైరెక్టర్.. వశిష్ట గురించి ఈ విషయాలు తెలుసా?

Show comments