Site icon NTV Telugu

Tragedy: తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య..

Suicide

Suicide

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల కలలను చెరిపేస్తున్నారు. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని అనవసరంగా ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి ఐఐటీ ఫలితాల్లో మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Read Also: Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సంకీర్ణం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు..

మాదాపుర్ అయ్యప్ప సోసైటిలోని నారాయణ కాలేజీలో విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కువ మార్కులు రావడంతో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. నారాయణ కాలేజీ రామానుజన్ క్యాంపస్ లో విద్యార్థి విజయ్ ఐఐటీ లాంగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి విజయ్(17 ) స్వస్థలం శ్రీకాళహస్తికి చెందినదిగా గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..

Exit mobile version