Kurnool: కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వెల్దుర్తి మండలం బోగోలులో ఈ ఘటన చేసుకుంది. బోగోలులో ఓ స్నేహితుడు సరదాగా నువ్వు బతికున్న చేపను మింగగలవా అంటూ పందెం కాశాడు. ఈ క్రమంలోనే బతికి ఉన్న చేపను మింగడంతో గొంతులో చిక్కుకుని వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం బాధితుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చేపను బయటకు తీశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kurnool: ప్రాణాల మీదకు తెచ్చిన వింత పందెం.. బతికున్న చేపను మింగాలంటూ..
- కర్నూలు జిల్లాలో వింత పందెం
- బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా పందెం వేసుకున్న స్నేహితులు
- బతికున్న చేపను మింగి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వెంకటస్వామి
Show comments